Breaking News

AIMIM కంచుకోటపై కమలం గురి.. పాత బస్తీలో బీజేపీ సవాల్!


దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పాత బస్తీలోని అన్ని వార్డుల్లో పోటీ చేయని కమలం పార్టీ.. ఈ సారి ఓల్డ్ సిటీలోని 50 వార్డుల్లోనూ అభ్యర్థులను బరిలో దింపుతోంది. ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎంతో పోటీకి సై అంటోంది. 2016 ఎన్నికల్లో పాతబస్తీలో 44 సీట్లు గెలుపొందిన ఏఐఎంఐఎం.. మిగతా పార్టీల కంటే ముందజలో ఉండగా.. టీఆర్ఎస్ రెండోస్థానంలో, కాంగ్రెస్ మూడు, బీజేపీ-టీడీపీ నాలుగో స్థానంలో ఉన్నాయి. మజ్లిస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని... ఇటీవలి వర్షాల కారణంగా భారీగా వరద నీరు ఇళ్లలోకి ముంచెత్తినప్పటికీ.. వేలాది కుటుంబాలకు ఆ పార్టీ ఏం చేయలేకపోయిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్ రావు ఆరోపించారు. సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ధి నినాదంతో తాము ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి బీజేపీలో చేరారు. తాను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవి కుమార్ యాదవ్ సైతం బీజేపీలో చేరారు. లక్షలాది మందికి డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖాస్తులు ఇచ్చి 2016 ఎన్నికల్లో మజ్లిస్-టీఆర్ఎస్ మోసం చేశాయని కాంగ్రెస్ మాజీ మంత్రి మహ్మద్ అలీ ఆరోపించారు. బిహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ పార్టీ ఓటు బ్యాంక్‌కు మజ్లిస్ గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. ఈసారి సెక్యూలర్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పక్షాన నిలవాలన్నారు.


By November 19, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/telangana/news/ghmc-elections-bjp-plans-to-contest-in-50-wards-in-old-city-to-fight-against-aimim/articleshow/79294946.cms

No comments