Breaking News

ఒక్క బీర్ తాగి రూ.2.20 లక్షలు టిప్ ఇచ్చిన కస్టమర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!


కరోనా వెరస్ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. కోవిడ్ భయంతో జనాలు ఇంతకు ముందులా బయటకెళ్లి భోజనం చేయడానికి, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా పార్టీలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అమెరికాలోని ఓహియోలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. బ్రెండన్ రింగ్ అనే వ్యక్తి 2001 నుంచి నైట్‌టౌన్ పేరిట ఓహియోలో రెస్టారెంట్ నడుపుతున్నాడు. కరోనా కారణంగా నష్టాలు వస్తుండటంతో.. కొంత కాలంపాటు రెస్టారెంట్‌ను మూసివేయాలని రింగ్ నిర్ణయించుకున్నాడు. సోమవారం తర్వాత మళ్లీ కరోనా ప్రభావం తగ్గే వరకు రెస్టారెంట్ తెరవొద్దని భావించాడు. చివరి రోజు ఆ రెస్టారెంట్లో పని చేస్తున్న అందరూ భారంగా ఉన్న వేళ.. తరచుగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లే ఓ యువకుడు కుటుంబంతోపాటు అక్కడికి వెళ్లాడు. బీర్ ఆర్డర్ చేసిన ఆ యువకుడు.. రెస్టారెంట్ ఓనర్ చేతికి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. బీర్‌కు 7 డాలర్లు బిల్లు కాగా.. ఆ కస్టమర్ అదనంగా 3 వేల డాలర్లు స్వైప్ చేశాడు. కళ్లద్దాలు లేకపోవడంతో 300 డాలర్లు అదనంగా ఇచ్చాడేమో అనుకున్న ఆ రెస్టారెంట్ యజమాని.. మరోసారి సరిగా చూసుకోగా 3 వేల డాలర్లని చూసి షాకయ్యాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి.. మీరేం చేశారో నాకు అర్థం కాలేదనగా.. మీరు చూసింది నిజమే. 3 వేల డాలర్లు టిప్‌గా ఇచ్చాను. మీ స్టాఫ్ అందరికీ సమానంగా పంచిపెట్టమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ కస్టమర్ మంచి మనసు రెస్టారెంట్ యజమానితోపాటు సిబ్బంది మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నారు.


By November 24, 2020 at 12:59PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-customer-drops-3000-tip-on-single-beer-here-is-the-reason/articleshow/79384745.cms

No comments