Breaking News

Nagarjuna: మామ మాట కాద‌న‌లేక సమంత డేరింగ్ డిసీజన్.. అందుకు రెడీ అనేసిన స్టార్ హీరోయిన్!


అక్కినేని కోడలిగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న తాజాగా మామ నిర్వర్తిస్తున్న ఓ బాధ్యతను భుజాలపై వేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెమెరా ముందు యమ యాక్టివ్‌గా ఉండే సామ్.. మామ మాట కాద‌న‌లేక హోస్ట్‌గా బాధ్యత తీసుకుందని టాక్. అరె! ఉన్నట్టుండి ఈ మార్పేంటి..? అంటే ఇకపై బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించరా? సమంతనే బిగ్ బాస్ టీమ్‌ని లీడ్ చేయబోతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి కదూ!. పూర్తి వివరాలు చూడండి అన్నీ మీకే అర్థమవుతాయి. బిగ్ బాస్ 4 హోస్ట్.. దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షోగా పాపులర్ అయిన బిగ్ బాస్ అన్ని ఇతర భాషలతో పాటు తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే విజయవంతంగా భారీ టీఆర్ఫీ సాధిస్తూ మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. కరోనాను సైతం లెక్కచేయకుండా అదే జోష్‌లో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టి బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది. గత సీజన్‌లో హోస్ట్‌గా ఆకట్టుకున్న నాగార్జునే ఈ నాలుగో సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫన్నీ టాస్కులతో, రొమాంటిక్ ముచ్చట్లతో వినోదం పంచుకుతున్నారు. బిజీ అయిన బిగ్ బాస్.. లాక్‌డౌన్ వేళ బిగ్ బాస్ కోసం తన డేట్స్ ఇచ్చి హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున అంతకుముందే కొన్ని సినిమాలకు ఓకే చెప్పారు. అందులో ఒకటి 'వైల్డ్ డాగ్'. నటీనటులంతా కరోనా భయంతో జంకిపోతుంటే నాగార్జున మాత్రం ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకొని సెట్స్ మీదకొచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే షూటింగ్స్ అనుమతులు లేకపోవడంతో ఇన్నాళ్లు ఈ షెడ్యూల్స్ వాయిదా పడుతూ వచ్చాయి కానీ ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఓ వైపు తన 'వైల్డ్ డాగ్' షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు బిగ్ బాస్ 4 కోసం సమయం కేటాయిస్తూ వచ్చిన నాగార్జున ఈ వారం మాత్రం అందుబాటులో లేరనే వార్తలు బయటకొచ్చాయి. నాగార్జున డౌటే!! ఆయన స్థానంలో.. కొన్ని రోజులపాటు షూటింగ్ నిమిత్తం నాగార్జున హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారని, ఈ వారం ఆయన బిగ్ బాస్ తెరపై కనిపించకపోవచ్చనే వార్తలు గత రెండు వారాలుగా వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నాగార్జున బిగ్ బాస్ తెరపై సందడి చేస్తున్నారు. కానీ ఈ వారం మాత్రం నాగార్జునకు వీలు పడటం లేదని, కాబట్టి పక్కాగా ఆయన స్థానంలో వేరొకరిని హోస్ట్‌గా చూడబోతున్నామనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణ, రోజా.. నిర్ణయం నాగార్జునదే! ఈ నేపథ్యంతో నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా వచ్చి గత సీజన్‌‌లో లాగానే బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో సందడి చేయనుందని మొదట వార్తలు విన్నాం. అయితే ఆమె కూడా బిజీగానే ఉన్న కారణంగా ఈ సారి కుదరదని చెప్పడంతో రోజా పేరు పరిశీలించిన బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ చివరకు ఆ నిర్ణయాన్ని నాగార్జునకే వదిలేసిందట. దీంతో ఆయన, తన కోడలు సమంతను హోస్ట్‌గా తీసుకోమని సూచించినట్లు టాక్ నడుస్తోంది. మామ మాట కాద‌న‌లేక సమంత ఈ వారం కోసం బిగ్ బాస్ హోస్ట్‌గా నువ్వే చేయాలని, అలా బుల్లితెర ప్రేక్షకులకు దసరా పండగ సందడి కూడా కలిసొచ్చినట్లుగా ఉంటుందని నాగార్జున తన కోడలు సమంత వద్ద ఈ ప్రపోజల్ పెట్టారట. దీంతో మామ మాట‌ను కాద‌న‌లేక ఆమె ఈ ఒక్క‌సారికి సమంత రెడీ అనేసినట్లు క‌థ‌నాలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు సమంత నుంచి గానీ, బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి గానీ దీనిపై అధికారిక సమాచారం రాలేదు.


By October 23, 2020 at 12:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-season-4-telugu-samantha-akkineni-will-replace-nagarjuna/articleshow/78823470.cms

No comments