Breaking News

Mumaith Khan: పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ముమైత్‌ ఖాన్.. అతను బ్లాక్‌‌మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు


నటి వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడమే గాక, క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె తనకు డబ్బులు ఎగ్గొట్టిందంటూ రాజు ఆరోపణలు గుప్పించాడు. అయితే దీనిపై ముమైత్ స్పందించకపోవడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయి ఆమెపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన ముమైత్.. క్యాబ్ డ్రైవర్ రాజుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు క్యాబ్ డ్రైవర్‌ను‌ చీట్ చేయాల్సిన అవసరం లేదని, అతను తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ముమైత్ పేర్కొంది. కొన్ని మీడియా ఛానళ్లు తన పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయని ఆవేదన చెందింది. క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాంట్లో నిజం లేదని.. అతని రాష్ డ్రైవింగ్ వల్లే తాను భయాందోళనకు గురయ్యానని ముమైత్ చెప్పడం విశేషం. అతనికి ఇవ్వాల్సిన 23 వేల 500 రూపాయలు ఇచ్చేశానని, అలాగే టోల్‌గేట్‌లకు సంబంధించి పూర్తి డబ్బులు తానే కట్టానని పేర్కొంటూ పోలీస్ కంప్లైంట్ చేసింది ముమైత్ ఖాన్. Also Read: ఈ మేరకు రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతను బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె పేర్కొనడం గమనార్హం. డబ్బుల కోసం క్యాబ్‌ డ్రైవర్‌ రాజు తనను బ్లాక్‌‌మెయిల్‌ చేస్తున్నాడని తెలిపింది. పోనీలే పేదవాడు అని మొదట ఊరుకున్నా గానీ అతని ప్రవర్తన బాగోలేదని మీడియాతో చెప్పింది ముమైత్ ఖాన్. అందుకే అతనిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొంది. క్యాబ్‌ డ్రైవర్‌ రాజు ఆరోపణలు చూస్తే.. ముమైత్ ఖాన్ మూడు రోజుల గోవా ట్రిప్ కోసం కారు బుక్ చేసుకుందని.. గోవాకు వెళ్ళిన తర్వాత ముమైత్ ఖాన్ మూడు రోజుల ట్రిప్‌ను ఎనిమిది రోజులకు పొడిగించిందని పేర్కొన్నాడు. ఈ ఎనిమిది రోజుల పాటు గోవా మొత్తం తిరిగినా ఎక్కడా టోల్ గేట్‌కు, డ్రైవర్ వసతికి డబ్బులు ఇవ్వలేదని.. ఈ మొత్తం కలిపి రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని రాజు ఆరోపించాడు.


By October 02, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mumaith-khan-police-complaint-against-cab-driver-on-bill-allegations/articleshow/78439611.cms

No comments