Breaking News

Monal Gajjar Elimination: బిగ్ బాస్ పోల్ రిజల్ట్: మోనాల్ ఆట కట్, బిగ్ బాస్ హిస్టరీలోనే రికార్డ్ ఓటింగ్, అఖిల్‌కి పనిపడింది


ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు? బిగ్ బాస్ వీక్షకుల్ని ప్రతివారం వెంటాడే ప్రశ్న ఇది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ ఎలిమినేషన్ ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. ప్రేక్షకులకు మద్దతు కూడగడుతున్న కంటెస్టెంట్లని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతుండటంతో తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. పనికిమాలిన సోది యవ్వారాలు, పులిహోర బ్యాచ్‌లను హౌస్‌లో కొనసాగిస్తూ ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాళ్లను హౌస్ నుంచి బయటకు పంపేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిపి బిగ్ బాస్ ఆట మొత్తం 19 మందితో ప్రారంభం కాగా.. ప్రస్తుతానికి హౌస్‌లో 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆరుగురు ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లగా.. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఏడోవారంలో బిగ్ బాస్ ఇంటి నుంచి బ్యాగ్ సర్దేయడానికి ఆరుగురు రెడీ అయ్యారు. మోనాల్, అభిజిత్, అవినాష్, దివి, అరియానా, నోయల్‌లు నామినేట్ అయ్యారు? మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయానికి వస్తే.. ప్రతివారం మాదిరిగానే ఈవారం కూడా సమయం తెలుగులో పోల్ నిర్వహించడం జరిగింది. గతవారం నిర్వహించిన పోల్ రిజల్ట్‌లో ‘సమయం తెలుగు’ పోల్‌లో మోనాల్ ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు స్పష్ఠమైన రిజల్ట్ ఇవ్వగా.. అనూహ్యంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈవారానికి సంబంధించి.. ‘బిగ్ బాస్‌ 4లో ఏడోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?’ పోల్ నిర్వహించగా.. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రెండో ఆలోచన లేకుండా బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ ఎలిమినేట్ కావాలని 69 శాతం మంది ఓట్లు వేశారు. ఇక ఈమె తరువాతి స్థానంలో దివి 9 శాతం ఓట్లతో ఉంది. అంటే దివికి మోనాల్‌కి మధ్య 60 శాతం ఓట్ల తేడా ఉందంటే ప్రేక్షకులు మోనాల్ పట్ల ఎంత అసహనంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడు-నాలుగు స్థానాల్లో 8 శాతం ఓట్లతో అరియానా గ్లోరీ, నోయల్‌లు ఉన్నారు. అభిజిత్ 4 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండగా.. చివరి ఆరో స్థానంలో అవినాష్ ఉన్నాడు. ఈ లెక్కన హాట్ స్టార్, ఫోన్ కాల్స్ అఫీషియల్స్ ఓటింగ్‌లో అందరికంటే ఎక్కువ ఓట్లు అవినాష్‌కి.. అందరి కంటే తక్కువ ఓట్లు మోనాల్‌కి పడినట్టుగా స్పష్ఠం అవుతోంది. అయితే బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక కంటెస్టెంట్‌పై ఇంత వ్యతిరేకత ఉండటం ఇదే తొలిసారి. ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి సంబంధించి పోల్స్ నిర్వహించినప్పుడు వారి మధ్య వ్యత్యాసం 20-30 మించి లేదు. కానీ మోనాల్ విషయంలో 60 శాతానికి పైగా తేడా ఉండటం గమనార్హం. అయితే గతవారం కూడా మోనాల్ ఎలిమినేషన్ అవ్వడం పక్కా అని పోల్ రిజల్ట్ వచ్చినప్పటికీ.. ఆమెను ఎలిమినేట్ చేయరు అని అని ప్రత్యేక కథనంలో ముందే తెలియజేసింది సమయం తెలుగు. అనుకున్నట్టుగానే మోనాల్‌ని సేవ్ చేసి.. కుమార్ సాయి ఎలిమినేట్ చేశారు. నాగార్జున ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని పదే పదే చెప్పినా మోనాల్ విషయంలో మాత్రం నిజం కాదని విమర్శలు వచ్చాయి. ఆమెను సేవ్ చేసి ఆట తప్ప వేరే ధ్యాస లేని కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్‌కి అప్పటివరకూ ఉన్న క్రెడిబిలిటీకి తూట్లు పడ్డాయి. అయితే ఈవారంలో మళ్లీ మోనాల్ నామినేషన్‌లోకి వచ్చింది. ఆమెను ఎంతో ప్రేమిస్తున్నట్టుగా జీవించేసే అఖిల్.. మోనాల్‌ని నామినేట్ చేసి తన రియల్ క్యారెక్టర్‌ని బయటపెట్టుకోగా.. ఈవారం కూడా బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్‌ని సేవ్ చేస్తే కనుక ప్రేక్షకులు నుంచి ఆగ్రహానికి బిగ్ బాస్ బలి కావాల్సిందే. ఎందుకంటే గతవారం మోనాల్‌ని సేవ్ చేయడంలో భాగంగా కుమార్ సాయి బలి అయ్యాడు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ న్యాయ బద్ధంగా లేదని.. ఓట్లు వేసినా వేస్ట్ అని.. ఇకపై బిగ్ బాస్ చూడము అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఈ ఆర్టికల్‌లో పొందుపరిచాం. ఇక ఈవారం కూడా మోనాల్‌ని సేవ్ చేయాల్సి వస్తే.. ఎవర్ని ఎలిమినేట్ చేస్తారు అంటే.. నామినేషన్స్‌లో ఉన్న నోయల్, అభిజిత్, అరియానా, దివి, అవినాష్‌లలో బలికావాల్సింది ఎవరు అంటే.. దివి లేదా అరియానా. బిగ్ బాస్ దత్తపుత్రికను సేవ్ చేయాల్సి వస్తే దివి, అరియానాల్లో ఒకరు బలి కావాల్సింది. అరియానా ఆట పులిలా ఆట ఆడుతోంది. రాక్షసులు-మనుషులు టాస్క్‌లో విశ్వరూపం చూపించి కెప్టెన్ పోటీదారునిగా ఎంపిక అయ్యింది. అయితే మోనాల్ హ్యాండ్ ఇవ్వడంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ను కోల్పోయింది అరియానా. అయితే హౌస్‌లో ఉన్న మోనాల్, దివి, లాస్య, హారిక కంటే అరియానా బెస్ట్ పెర్ఫామర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవినాష్ వచ్చిన తరువాత కాస్త ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది కానీ.. టాస్క్‌ల విషయంలో ఆమెకు పోటీ లేదు. ఆటలోకి దిగింది అంటే ఇరగదీస్తుంది. కొన్నిసార్లు కెమెరాలో ఫోకస్ కావాలనే తాపత్రయం కనిపిస్తుంది కానీ.. హౌస్‌లో ఉన్న మిగిలిన అమ్మాయిల కంటే అరియానా చాలా బెటర్. అయితే అందాలు దారబోసి.. ఎఫైర్లు, రొమాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌ని హీటెక్కించి రేటింగ్ వనరుగా మారిన మోనాల్‌ని సేవ్ చేయడానికి అరియానాను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక దివికి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది.. ప్రస్తుతానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉంది. రాజశేఖర్ మాస్టర్‌తో ఉన్న బాండింగ్ ఒక్కటే ఆమెకు సమస్య కాగా.. ఆట పరంగా దివికి మంచి మార్కులే పడుతున్నాయి. ఇవి అవినాష్.. బిగ్ బాస్ హౌస్‌లోనే బెస్ట్ ఎంటర్ టైనర్. మోనాల్ విషయంలో కాస్త కక్కుర్తిగా వ్యవహరిస్తున్నాడు కానీ.. వినోదం విషయంలో అవినాష్ పర్లేదు. పైగా హౌస్‌కి కెప్టెన్ కూడా అయ్యాడు. సో హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి.. నామినేషన్‌లో ఉన్నా.. ఎలిమినేట్ చేసిన సందర్భాలు లేవు. సో అవినాష్ సేవ్ కావడం పక్కా. ఇక మిగిలిన వారిలో అభిజిత్, నోయల్‌లు నామినేషన్‌లో ఉన్నా లేనట్టే. వాళ్లకి ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువ ఉండటంతో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. మొత్తంగా ఏడోవారంలో ఓటింగ్‌ని బట్టి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగితే మోనాల్ నూటికి నూరు శాతం బిగ్ బాస్ హౌస్‌ని బ్యాగ్ సర్దేయాల్సిందే. ఒకవేళ సేవ్ చేయాలి.. మరింత మసాలా కావాలి అనుకుంటే మాత్రం దివి, అరియానాల్లో ఒకర్ని ఎలిమినేట్ చేయొచ్చు. లేదంటే అసలు ఎలిమినేషన్ ప్రక్రియనే ఎత్తేసి మరోవారం వరకూ మోనాల్ చిత్ర విచిత్రమైన అరాచక విన్యాసాలను చూపించనూ వచ్చు. అయితే ఈసారి కూడా మోనాల్‌ని సేవ్ చేశారు అంటే ప్రేక్షకుల ఆగ్రహం రెట్టింపు కావడం ఖాయమే కాబట్టి.. బిగ్ బాస్ క్రెడిబిలిటీ మరింత దిగజార్చుకోరనే అనిపిస్తుంది. సో.. మళ్లీ మనం అఖిల్ విరహవేదన.. కెమెరాల ముందు నాటకీయ ఏడుపులను చూడబోతున్నామన్న మాట.


By October 23, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-telugu-seventh-week-elimination-is-monal-gajjar-getting-eliminated/articleshow/78821881.cms

No comments