Kakinada: డ్యూటీకి డుమ్మాకొట్టినా ఆరేళ్లుగా జీతం.! గవర్నమెంట్ డాక్టర్ అరెస్ట్
ఒకటి కాదు రెండు ఏకంగా ఆరేళ్లు డ్యూటీకి డుమ్మా కొట్టాడు. అయినా అధికారుల అండ.. సహోద్యోగుల సపోర్ట్‌తో నెలనెలా జీతం మాత్రం ఠంచన్‌గా తీసుకునేవాడు. జిల్లా వైద్యాధికారి తనిఖీల్లో హెల్త్ అసిస్టెంట్ అసలు రంగు బయటపడడంతో ఆస్పత్రి డాక్టర్‌తో సహా నలుగురు కటకటాలపాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన జిల్లాలో జరిగింది. బిక్కవోలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొంకుదురు పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన పులగం రామక్రిష్ణారెడ్డి గత ఆరేళ్లుగా విధులకు డుమ్మాకొట్టాడు. డ్యూటీకి రాకుండానే అక్రమంగా జీతం తీసుకుంటున్నాడు. ఈ విషయం గమనించిన అప్పటి డీఎంహెచ్‌వో గత మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు సదరు హెల్త్ అసిస్టెంట్‌కి సహకరించిన కర్రి పోచేశ్వరరావును ఇప్పటికే అరెస్టు చేశారు. అతనికి సహకరించినందుకు కొంకుదురు పీహెచ్‌సీ వైద్యుడు మట్టపర్తి శివాజీ, సూపర్‌వైజర్ లక్ష్మి, అసిస్టెంట్ సూపర్‌వైజర్ పులసకూర అరుణ కుమారి, యూడీసీ సత్యమూర్తిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. Also Read:
By October 14, 2020 at 12:09PM
No comments