Breaking News

పనిచేయని నిద్రమాత్రలు.. ప్రాణాలు తీసుకున్న అన్నదమ్ములు.. తిరుపతిలో విషాద ఘటన


అన్నదమ్ముల సొంత వ్యాపారం. నాలుగు నెలల కిందటే ప్రేమించిన అమ్మాయితో వివాహం. ఇంతలోనే ఆర్థిక ఇబ్బందుల రూపంలో అవాంతరాలు ఎదురయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడే మార్గం కనిపించక అఘాయిత్యానికి ఒడిగట్టారు అన్నదమ్ములు. భార్యకి నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన విషయం బయటపడడంతో ఆమె వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం అన్నదమ్ములు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన జిల్లాలో జరిగింది. సమీపంలోని తిమ్మినాయుడుపాళేనికి చెందిన సాయికుమార్(27), వెంకటేష్(24) కరకంబాడి రోడ్డులోని డీమార్ట్ సమీపంలో జేమార్ట్ పేరిట కూరగాయలు, పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ డోర్ డెలివరీ చేసేవారు. తమ్ముడు వెంకటేష్ కేఆర్ నగర్‌కి చెందిన పూజాప్రసన్నని నాలుగు నెలల కిందట ప్రేమవివాహం చేసుకున్నాడు. అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో వెంకటేస్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన భార్య పూజాప్రసన్న, అన్న సాయికుమార్‌కి తెలియకుండా పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి తానూ తాగాడు. నిద్రమాత్రలు కలిపినా అంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆ విషయం భార్యకి తెలిసిపోవడంతో ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. మరుసటి రోజే అన్నదమ్ములు సమీపంలోని దామినీడు హౌసింగ్ బోర్డు చెరువులో విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. Read Also: చెరువు కట్టపై బైక్, అందులో విజిటింగ్ కార్డులు ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాత్రివేళ చెరువు వద్దకు వచ్చిన అన్నదమ్ములు బైక్ పక్కన పార్క్ చేసి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By October 22, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-brothers-commits-suicide-in-tirupati/articleshow/78801981.cms

No comments