దీక్షిత్ కిడ్నాప్: బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పు.. చంపింది ఇక్కడే.. వీడియో

నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్‌లో కిడ్నాపైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ కథ విషాదంగా ముగిసింది. ఈ బాలుడి శవం మహబూబాబాద్ శివారులో స్థానికులు గుర్తించారు. గత ఆదివారం దీక్షిత్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడిని అప్పగించేందుకు వారు రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చేందుకు దీక్షిత్ తండ్రి తెలిసినవారి వద్ద అప్పులు కూడా చేశాడు. ఆ డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డాడు. ఇంతలో దుండగులు బాలుడ్ని హత్య చేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా కిడ్నాపర్ల కోసం వంద మంది పోలీసుుల గాలించారు. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్, మరో ముగ్గురిపై దీక్షిత్ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు అత్యంత సన్నిహితులే అయినట్లు సమాచారం. కాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందుకు తీసుకురానున్నారు. మత్తుమందు ఇచ్చి బాలుడిని చంపినట్లు తెలుస్తోంది. బాలుడి శవం మహబూబాబాదుకు 5 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రధాన సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌లో బాలుడి నివాస ప్రాంతమైన కృష్ణ కాలనీకి చెందిన కొంతమందికి కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకున్న అనంతరం కిడ్నాప్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన తీరును పోలీసులకు కళ్ళకు కట్టినట్టు నిందితులు వివరించారు.
By October 22, 2020 at 10:32AM
No comments