Breaking News

అందరూ సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తారు.. బయటికి కనిపించేది వేరు: పవన్ కళ్యాణ్


చిత్ర పరిశ్రమలో ఓ సినిమా హిట్ అయితే డబ్బు కంటే పేరు పదిరెట్లు ఎక్కువగా వస్తుందని అన్నారు పవర్‌స్టార్ . ఇండస్ట్రీలో పేరు సంపాదించిన వాళ్లంతా డబ్బున్న వాళ్లు కాదని.. కానీ బయట జనాలు మాత్రం వారిని ధనవంతులుగానే చూస్తారని అన్నారు. ‘రూ.కోటితో సినిమా తీస్తే రూ.10కోట్ల ఇమేజ్ వస్తుంది. సినీ పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు’ అని తెలిపారు. Also Read: ‘‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్లో లీకైంది. దీంతో ఆ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేను సంతకాలు పెట్టి ఆ సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. సినీనటులకు పేరు ఆకాశమంత ఉన్నా డబ్బు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. నిజమైన సంపద రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల దగ్గరే ఉంటుంది. ఓ వ్యక్తి సినిమాల ద్వారా రూ.కోటి సంపాదిస్తే పన్నులు, ఇతర ఖర్చులన్నీ పోయి రూ.55-60లక్షలు మాత్రమే చేతికి అందుతుంది. నష్టం వస్తే ఆ డబ్బు కూడా రాదు. అందుకే ఒక్క ప్లాప్‌తోనే సర్వం కోల్పోయివాళ్లు కూడా ఉన్నారు’ ‘చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైనది. అందుకే అందరూ దాన్ని టార్గెట్ చేస్తుంటారు. సహాయ కార్యక్రమాల నిమిత్తం సినిమా నటులు ఎంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చినా.. అంతేనా అంటూ కొందరు హేళన చేస్తుంటారు. కానీ అలాంటి వారు కనీసం రూ.10 అయినా ఇచ్చారా?. కష్టపడి పనిచేసేవారికి జేబులోంచి రూ.10లక్షలు ఇవ్వాలంటే మనసు అంగీకరిస్తుందా? అని పవన్ వ్యాఖ్యానించారు. Also Read:


By October 23, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-pawan-kalyan-reacts-on-tollywood-celebrities-donations/articleshow/78820832.cms

No comments