సరిహద్దు ప్రతిష్టంభన: చైనా డిమాండ్‌కు నో చెప్పిన భారత్


భారత్, చైనాల మధ్య తూర్పు లడఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ఇరు దేశాల దౌత్య, సైనిక అధికారుల మధ్య పలుసార్లు చర్చలు జరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఘర్షణ నెలకున్న అన్ని ప్రాంతాల నుంచి తక్షణమే బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బలగాల ఉపసంహరణకు ముందే సాయుధ, సైనిక దళాల విస్తరణకు అంగీకరించాలని కోరుతుంది. అయితే, దీనికి భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే భారత్ కంటే చైనా తన దళాలు, ఆయుధాలను సులువుగా తరలించడానికి అవకాశం ఉంది. ‘సెప్టెంబరు 10 మాస్కో వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎల్ఏసీ వెంబడి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్, చైనాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలను కొనసాగిస్తున్నాయి’ అని శ్రీవాస్తవ తెలిపారు. సెప్టెంబరు 30న ఇరు దేశాల దౌత్యస్థాయి చర్చలు, అక్టోబరు 12న ఏడో విడత సైనిక అధికారుల మధ్య చర్చలు జరిగినట్టు గుర్తుచేశారు. ‘పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సైనిక, దౌత్యస్థాయి చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలనే కాంక్షను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు.
By October 23, 2020 at 09:43AM
No comments