Breaking News

అదే లుక్‌లో పవన్ కళ్యాణ్.. ఫీలవుతున్న ఫ్యాన్స్


లాక్‌డౌన్ తర్వాత తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా తమ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోతున్నారు. మరికొందరేమో నవంబర్‌లో మొదలయ్యే షూటింగులకు సన్నద్ధమవుతున్నారు. అయితే వరుస సినిమాలను అంగీకరిస్తున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాత్రం షూటింగులకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది మిస్టరీగా మారింది. ఆయన ప్రస్తుత లుక్ చూస్తే అభిమానులకు కూడా అదే అనుమానం వస్తోంది. హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోటి రూపాయ‌ల విరాళం అందించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప‌వ‌న్ ఓ సెల్పీ వీడియోని కూడా విడుదల చేశాడు. అయితే ఆ వీడియోలో పవన్‌ లుక్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. గతంలో కంటే గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో పవన్‌ కనిపించడంతో తమ హీరో అసలు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని డౌట్ పడుతున్నారు. షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, అందులో పవన్ పాల్గొంటాడని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు పవన్ ఇంకా స్వామీజీలా అదే గెటప్‌లో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన వాలకం చూస్తే ఇంకా షూటింగ్ మూడ్‌లోకి రానట్లే ఉన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి పవన్ ఎలా సమాధానమిస్తారో చూడాలి.


By October 22, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fans-worried-about-pawan-kalyan-look/articleshow/78799687.cms

No comments