‘డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు’.. అధికారులపై హీరోయిన్ల ఫైర్
డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను ఈడీ అధికారులు బుధవారం కూడా విచారించారు. సంజనా పేరిట 11 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, వాటిలో రూ.40లక్షల వరకు అమౌంట్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెట్టినట్ల విచారణలో వెలుగులోకి వచ్చింది. సంజనాకు అరెస్ట్ చేయడానికి నాలుగు వారాల ముందు నుంచి అనేక బ్యాంక్ అకౌంట్లలోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు.
కూడా విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని చాలామందికి సరఫరా చేసిందన్న కోణంలో అధికారులు విచారించారు. వీరితో పాటు జైలులో ఉన్న ఇతర నిందితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సినిమాలు, షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్ ద్వారానే ఆదాయం సంపాదించామని ఇద్దరు హీరోయిన్లు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్ముకుని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. Also Read: అయితే నగదు బదిలీ, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ప్రశ్నలకు వారిద్దరు అస్పష్టంగా సమాధానం చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సంజనా, రాగిణిని మరింత విచారించి సరైన సమాధానాలు రాబట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఉచ్చు బిగుసుకున్న ఇద్దరు హీరోయిన్లపై తాజాగా సెక్స్ రాకెట్ ఆరోపణలు వచ్చాయి. వ్యభిచారం నిర్వహణకు వీరు ఓ వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, పోలీసులు అరెస్ట్ చేసే ముందు దాన్ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. By October 01, 2020 at 07:52AM
No comments