అత్తింటి ముందే అల్లుడి ఆత్మహత్య.. కడపలో షాకింగ్ ఘటన
గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను వెనక్కి తెచ్చుకుందామని అత్తింటికి వెళ్లాడు. కానీ ఆమె వచ్చేది లేదని తెగేసి చెప్పడంతో అక్కడే చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన బి.రాజశేఖర్(26)కి ప్రొద్దుటూరుకి చెందిన బొమ్మిశెట్టి లక్ష్మీనారాయణ కూతురు వైజయంతితో గతేడాది డిసెంబరులో వివాహమైంది. రెండు నెలలకే కాపురంలో కలహాలు రేగాయి. భర్తతో గొడవపడిన భార్య కాపురం చేయలేనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు పంచాయితీ చేయడంతో ప్రొద్దుటూరులో కాపురం పెడితేనే వస్తానని భీష్మించడంతో మూడు నెలల కిందట పట్టణానికి మకాం మార్చారు. మరోమారు ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటికి వెళ్లిన రాజశేఖర్ కాపురానికి రావాలని భార్యను కోరాడు. Also Read: అందుకు ఆమె ససేమిరా అనడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అత్తింటి వద్దే పురుగులమందు తాగేశాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. భార్య కాపురానికి రాలేదన్న బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బాబులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:
By October 14, 2020 at 10:27AM
No comments