కూచిపూడి నృత్య కళాకారిణి శోభనాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభనాయుడు మృతిచెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త విని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. కూచిపూడి నాట్య కళాకారిణిగా శోభానాయుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు చేశారు. నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభతో ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. Read More: మరోవైపు పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. శోభానాయుడు ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, కార్యదర్శి పొట్లూరి రవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చి కళారంగానికి ఎనలేని సేవలు చేసారని కొనియాడారు.
By October 14, 2020 at 11:11AM
No comments