సైనికుడి ఆప్యాయతకు ఫిదా అయిన ఉగ్రవాది.. వైరల్ అవుతోన్న ఆర్మీ వీడియో
ఇటీవల ఉగ్రవాదంలో చేరిన ఓ కశ్మీర్ యువకుడు సైన్యానికి లొంగిపోయిన సందర్భంలో తీసిన ఓ ఆసక్తికర వీడియోను సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. ఇరవైల్లో ఉన్న ఆ యువకుడు కొద్ది రోజుల కిందటే ఉగ్రవాదంలో చేరగా.. అతడి నుంచి ఓ ఏకే-47 రైఫిల్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఓ పండ్ల తోట సమీపంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి, రైఫిల్ పట్టుకున్న ఒక సైనికుడు..ఉగ్రవాదిని లొంగిపోవాలని సూచించడం ఆర్మీ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా ఉంది. Read Also: ఆ ఉగ్రవాదిని జహంగీర్ భట్‌గా గుర్తించగా.. నీకు ఎటువంటి హాని జరగదని సైనికుడు భరోసా ఇవ్వడంతో సదరు ఉగ్రవాది తన చేతులను గాలిలో పైకి లేపి, దగ్గరకు రాగా నిన్ను ఎవరూ కాల్చరు అని చెప్పాడు. ‘నీకు ఏమీ జరగదు కుమారా’ అంటూ సైనికుడు ఆప్యాయంగా ఉగ్రవాదికి చెప్పిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. జవాన్ మాటలకు ఉగ్రవాది నిశ్చేష్టుడుకాగా.. అనంతరం అతనికి నీరు ఇవ్వండి అని సైనికుడు చెప్పడం వీడియోలో ఉంది. Read Also: తన కుమారుడికి ఎటువంటి హాని తలపెట్టకుండా, ప్రాణాలతో అప్పగించిన సైన్యానికి ఆ యువకుడి తండ్రి కృతజ్ఞతలు చెబుతున్న మరో వీడియోను ఆర్మీ విడుదల చేసింది. మరోసారి తన కుమారుడు ఉగ్రవాదంలోకి వెళ్లబోడని ఆయన పేర్కొన్నారు. జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. సైన్యం ఓ వ్యక్తి జీవితాన్ని కాపాడినందుకు సంతోషంగా ఉందన్నారు. Read Also: ‘రెండు ఏకే-47 రైఫిల్స్ అపహరణకు గురయినట్టు అక్టోబరు 13న ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు.. అదే రోజు, చాదూరాకు చెందిన జహంగీర్ ఆహ్ భట్ కనిపించకుండాపోయాడు. అతడి కోసం కుటుంబం గాలించింది. శుక్రవారం ఉదయం జరిగిన ఆపరేషన్‌లో అతడిని గుర్తించాం.. ప్రోటోకాల్ ప్రకారం.. అతడిని లొంగిపోవడానికి ఒప్పించే ప్రయత్నాలు చేసింది... అతడు లొంగిపోయాడు’ అని ఆర్మీ తెలిపింది. Read Also: యువకుడి తండ్రి ఘటనా స్థలంలో ఉన్నారు.. యువతను ఉగ్రవాదం నుంచి వెనక్కు వచ్చేలా చేసే ప్రయత్నాల ప్రభావం కనిపించింది.. ఉగ్రవాద రిక్రూట్‌మెంట్లను నిరోధించడానికి సైన్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఒకవేళ ఉగ్రవాదంలో చేరినవారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తోంది’ అని పేర్కొంది. యాంటీ-టెర్రరిస్ ఆపరేషన్ సందర్భంగా ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ షోపియాన్ జిల్లా కిలూర గ్రామానికి చెందిన ఓ ఉగ్రవాది ఈ విధంగానే లొంగిపోయాడు.
By October 17, 2020 at 10:23AM
No comments