Breaking News

నన్ను కూడా కలర్ తక్కువని హేళన చేశారు: ‘కలర్‌ ఫోటో’ హీరోయిన్ చాందిని


తాను చేసిన సినిమాలు అందరికీ నచ్చాలనే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో చిత్రాలు చేశానని, ఇప్పుడు మాత్రం మనసుకు నచ్చిన పాత్రలు చేయాలనుకుంటున్నానని అన్నారు తెలుగమ్మాయి . షార్ట్‌ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన చాందిని లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో అవకాశం దక్కించుకుంది. `కేటుగాడు` సినిమాతో హీరోయిన్‌గా మారి.. మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’లో మెరిసింది. ‘కుందనపుబొమ్మ’ సినిమాతో మంచి గుర్తింపు దక్కినా.. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. తాజాగా యువ హాస్యనటుడు సుహాస్‌తో కలిసి చాందిని నటించిన ‘కలర్‌‌ఫోటో’ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ యాప్ ద్వారా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ముచ్చటించారు. ‘సందీప్‌ రాజ్‌ ఏడాది క్రితమే ‘కలర్‌ ఫొటో’ కథ చెప్పాడు. నా పాత్ర నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశా. సుహాస్ కొత్త హీరో అని ఆలోచించలేదు. ఇప్పుడు ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలను ఆదరిస్తున్నారు. 1990 కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రం వర్ణవివక్ష ప్రధానాంశంగా తెరకెక్కింది. అప్పటి ఆహార్యంతో స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తా’ Also Read: ‘మనసుకు నచ్చినట్లు జీవించాలనుకునే అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనే ఈ సినిమాలో చూపించనున్నారు. ‘సమాజంలో ఇప్పటికీ వర్ణ వివక్ష ఉంది. హీరోయిన్ అయ్యాక ‘నువ్వేమైనా పెద్ద కలర్ అనుకుంటున్నావా?’ అని నన్నొకరు అడిగారు. అంతకుమించి ఇక్కడ నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. రంగును బట్టి ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని, స్థాయిని అంచనా వేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చింది చాందిని. Also Read: ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు చాందిని తెలిపింది. సుధీర్‌ వర్మ నిర్మాణంలో ప్రవీణ్‌ దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంతో పాటు ఓ ప్రేమకథా చిత్రం, విశ్వక్‌ సేన్‌కి జంటగా ‘ప్రాజెక్ట్‌ గామి’ అని మరో చిత్రం చేస్తున్నా. హిమాలయాల నేపథ్యంలో అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌లా ఈ సినిమా తెరకెక్కింది. ఓ పాత్రకు, మరో పాత్రకు సంబంధం లేకుండా మంచి చిత్రాలు, పాత్రలు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు చాందిని చౌదరి తెలిపింది. Also Read:


By October 17, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/colour-photo-movie-heroine-chandini-chowdary-reveals-apartheid-incidents-in-tollywood/articleshow/78715033.cms

No comments