పవర్‌స్టార్ బాటలో మాస్ మహరాజ్.. ఎక్కడా తగ్గడం లేదుగా
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్‌స్టార్ ఇప్పుడు జోరు పెంచారు. ‘వకీల్‌సాబ్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆయన ఆ తర్వాత కూడా కనీసం సినిమాలు లైన్లో పెట్టారు. పూర్తిగా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన టైమ్‌లో కూడా పవన్ ఇంత వేగంగా సినిమాలు ఒప్పుకోలేదు. వకీల్ సాబ్‌లో లాయర్‌గా కనిపించనున్న పవన్‌కళ్యాణ్‌కు సంబంధించి ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు పవన్ బాటలోనే మాస్ మహరాజ్ కూడా పయనిస్తున్నారు. Also Read: ప్రస్తుత ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ చిత్రం ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ తరహాలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీంతో వరుస సినిమాలు ఒప్పుకోవడంతో పాటు లాయర్‌గా కనిపించనుండటంతో రవితేజ.. పవర్‌స్టార్‌ని ఫాలో అవుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. Also Read:
By October 06, 2020 at 08:06AM
No comments