Breaking News

అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. అమ్మాయి తండ్రి ఆత్మహత్యాయత్నం


తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే డిగ్రీ చదువుతోన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, అతడికి 39, ఆమెకు 19 కావడంతో వివాదం రేగుతోంది. అంతేకాదు, వధువు తండ్రి సైతం ఆ ఎమ్మెల్యే తన కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. వయసులో ఇద్దరికి 20 ఏళ్లు తేడా ఉందని, పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామని ఎమ్మెల్యే బెదిరించాడని ఆరోపిస్తూ ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. Read Also: కల్లకూరిచి అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకి తియకతురుగంలోని తన నివాసంలోనే సౌందర్య అనే యువతితో సోమవారం నిరాడంబరంగా వివాహం జరిగింది. ఎమ్మెల్యే తల్లిదండ్రులు, సన్నిహితుల సమక్షంలోనే జరిగిన ఈ వివాహానికి వధువు సౌందర్య కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరుకాలేదు. ఇది ప్రేమ వివాహం కావడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ రాలేదు. Read Also: ఇది కులాంతర వివాహం కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెకు మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సౌందర్య తండ్రి గురుక్కుల్ స్వామినాథన్ ఆరోపించారు. అంతేకాదు, ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఎమ్మెల్యే ప్రభుకు 39 ఏళ్లు, తన కుమార్తెకు 19 ఏళ్లు, ఇద్దరి మద్య 20 ఏళ్ల తేడా ఉందని స్వామినాథన్ ఆరోపించారు. Read Also: తన కుమార్తెను అపహరించాడని, ఆమెను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని ప్రభు మీడియాకు చెబుతున్నాడు, అంటే తన కుమార్తెకు 9 ఏళ్లు వయసు ఉన్నప్పటి నుంచి అతను ప్రేమిస్తున్నాడా? అదిసాధ్యమా? అని స్వామినాథన్ ప్రశ్నించారు. సౌందర్య తండ్రి ఓ అలయంలో అర్చకుడిగా పనిచేస్తుండగా.. ఆమె ప్రస్తుతం బీఏ ఇంగ్లిష్‌ రెండో ఏడాది చదువుతోంది. ఎమ్మెల్యే ప్రభు తన వివాహానికి సంబంధించిన ఫోటోను విడుదల చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగినట్టు తెలిపారు.


By October 06, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aiadmk-mla-prabhus-secret-marriage-stirs-controversy-in-tamil-nadu/articleshow/78505435.cms

No comments