Breaking News

థియేటర్లు ఓపెన్ అయినా రిలీజ్‌కు వెనుకాడుతున్న హీరోలు.. కారణమిదే


అన్‌లాక్‌లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే కేవలం 50శాతం ఆక్యుపెన్సీతోనే షోలు వేయాలని, సీట్ల మధ్య ఎడం పాటించాలంటూ సవాలక్ష నిబంధలను కేంద్ర ప్రభుత్వం విధించింది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ల ఓపెన్ అయినా సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న సినిమాలు దసరాకు విడుదల అవుతాయని టాలీవుడ్‌ వర్గాలు ఓ వైపు చెబుతుండగా.. అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా? అని నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. Also Read: ఒకవేళ సినిమా విడుదల చేసినా ఆశించినంతగా ప్రేక్షకులు రాకపోతే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని, దానికంటే ఓటీటీలో నచ్చిన ధరకు అమ్ముకుంటేనే బెటరని కొందరు ఆలోచిస్తు్నట్లు తెలుస్తోంది. నిర్మాతలతో పాటు ఆయా సినిమాల హీరోల ఆలోచన సైతం ఇలాగే ఉన్నట్లు సమాచారం. లేకపోతే కొద్దిరోజులు ఆగి దీపావళి బరిలో దిగుదామని కూడా కొందరు నిర్ణయించుకున్నారట. లేకపోతే రెండు నెలలు ఆగి సంక్రాంతికే సినిమాలు విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయట. Also Read:


By October 08, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-heroes-hesitant-to-release-their-movies-even-if-the-theaters-are-open/articleshow/78545745.cms

No comments