ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం... నాన్న కోసం ప్రార్థించాలంటూ శివాత్మిక ట్వీట్

కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుబార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. జీవితకు కూడా కరోనా నెగిటివ్ రాగా.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక ట్వీట్ చేశారు. Also Read: ‘కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉండటంతో పాటు మెరుగుపడుతోంది. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి’ అంటూ శివాత్మిక ట్వీట్ చేశారు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని, ఇద్దరు కుమార్తెలు కోలుకోగా.. తాను, జీవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాజశేఖర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులకే జీవిత కూడా కరోనా నుంచి కోలుకోగా... రాజశేఖర్ మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. Also Read:
By October 22, 2020 at 10:08AM
No comments