Breaking News

కూతురు కనిపించకుండా పోయినా కేసు పెట్టని తండ్రి.. ఖాకీల ఎంట్రీతో షాకింగ్..


కూతురు కనిపించకుండా పోయినా కనీసం కేసు పెట్టకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో దారుణం వెలుగుచూసింది. పెళ్లి కాకుండానే కూతురు గర్భం దాల్చిందని తెలియడంతో అవమానంగా భావించిన కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక మోసపోయింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసిన తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. మైనర్ బాలికను మోసం చేసిన కీచకుడిని కటకటాల్లోకి నెట్టించాల్సిందిపోయి కూతురిపైనే కోపం పెంచుకున్నాడు. కూతురు గర్భం దాల్చిందని ఊరి జనం హేళనగా మాట్లాడుతుండడంతో తండ్రి తట్టుకోలేకపోయాడు. తన పెద్ద కొడుకుతో కలసి బాధితురాలిని దారుణంగా చంపేశాడు. గర్భానికి కారణం ఎవరో చెప్పాలని ఆమెను దారుణంగా కొట్టి.. ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు చేసి నదీతీరంలో పాతిపెట్టాడు. గత నెల 23 వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయినప్పటకీ కుటుంబసభ్యులు కనీసం మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఆ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత ఆమె తమ బంధువుతో కలసి ఉంటోందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. Also Read: పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో కూతురిని చంపేసినట్లు ఆమె తండ్రి ఒప్పేసుకున్నాడు. నదీతీరంలో పాతిపెట్టిన ఆమె శవాన్ని వెలికితీయించి పోస్టుమార్టం జరిపించారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన మోసగాడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. చనిపోయే వరకూ తనను మోసం చేసిందెవరో బాలిక చెప్పకపోవడం గమనార్హం. అయితే మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమని.. అతనెవరో గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్‌ఎస్పీ ఆనంద్ తెలిపారు. మృతురాలి తండ్రిని, సహకరించిన సోదరుడిని అరెస్టు చేశారు. ఆమె హత్య కేసులో మిగిలిన కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన తెలిపారు. Read Also:


By October 07, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-year-old-pregnant-girl-strangled-to-death-by-father/articleshow/78527829.cms

No comments