Breaking News

చిత్తూరులో మహిళా వాలంటీర్ అదృశ్యం.. వైసీపీ నేతపై కిడ్నాప్ కేసు


మహిళా వాలంటీర్ అదృశ్యం ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఆమె తల్లిదండ్రులు స్థానిక వైసీపీ నేతపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వీరపల్లె పంచాయతీ తొమ్మిదో క్లస్టర్ వాలంటీర్గా పనిచేస్తున్న యువతి గురువారం విధులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కంగారపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గతంతో తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎస్పీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ రావడం.. యువతి ఫోన్ కూడా పని చేయకపోవడంతో అనునాలు బలపడుతున్నాయి. శ్రీనివాసులు, అతని అనుచరులే తమ కుమార్తెను ఎత్తుకెళ్లారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పెద్ద పంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత శ్రీనివాసులు, అతని భార్య శ్రీదేవి, అనుచరులతో కలిపి ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే వాలంటీర్తో అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన కేసులో శ్రీనివాసులు అరెస్టయి ఇటీవల బెయిల్ పై వచ్చాడు. Also Read:


By October 25, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-grama-volunteer-missing-in-chittoor/articleshow/78855738.cms

No comments