Breaking News

Bigg Boss Host Samantha: బిగ్ బాస్ హోస్ట్ సమంత ప్రోమో.. కోడలు పిల్ల వచ్చింది.. మామని మరిపించింది.. సర్ ప్రైజ్‌లు మామూలుగా లేవు


బిగ్ బాస్ షోకి హోస్ట్ నాగార్జున స్మాల్ బ్రేక్ ఇవ్వడంతో ఆ ప్లేస్‌ని భర్తీ చేసింది కోడలు పిల్ల . కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగ్‌లో భాగంగా లాంగ్ షెడ్యూల్‌‌కి హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. దీంతో బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతల్నిచేపట్టింది కోడలు పిల్ల సమంత. అదేంటి ఆమెకు తెలుగు సరిగా రాదుగా కదా.. తెలుగు షోకి హోస్ట్ చేయడం అని పెదవి విరుపులు వస్తూనే ఉంటాయి కానీ.. తెలుగు హీరో అక్కినేని వారసుడ్ని పెళ్లాడిన తరువాత తెలుగు భాషపై పట్టు సాధించింది సమంత. అయితే ఎక్కడో గుజరాతీ భామల్ని తీసుకొచ్చి కంటెస్టెంట్స్‌గా పెట్టి.. వారం మొత్తం వాళ్ల రోత భాషను పదే పదే చూపిస్తుంటే.. జస్ట్ వారంలో ఒకరోజు సమంత వస్తే తప్పేం లేదులే. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే.. మామ ప్లేస్‌లో బిగ్ బాస్ హోస్ట్‌గా వచ్చిన కోడలు పిల్ల సమంత అదరగొడుతోంది. విజయదశమి సందర్భంగా సమంత హోస్ట్ చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి 4.50 ప్రోమో విడుదల చేయగా.. ఇందులో చాలా సర్ ప్రైజ్‌లు ఉన్నాయి. ఎంత చక్కగున్నవే లచ్చిమి.. ఎంత చక్కగున్నవే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సమంత.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుని విజయ దశమి శుభాకాంక్షల్ని అందించారు. అరియానాని ఇమిటేట్ చేస్తూ.. అవినాష్ సోఫా మ్యాటర్‌తో ఆటాడుకుంది సమంత. సోఫా మ్యాటర్ ట్రెండింగ్ మా.. అంటూ అవినాష్‌పై పంచ్‌లు వేశారు. ఇక అవినాష్ కూడా రివర్స్ పంచ్‌లు వేయడంతో నాపైనే పంచ్‌లు వేస్తున్నావా?? హలో నాఫ్యాన్స్‌కి చెప్తే.. అంటూ హలో అనడంతో.. దెబ్బకి దారిలోకి వచ్చిన అవినాష్.. నేను సమంత ఫ్యాన్స్ అసోసిషియేషన్ ప్రెసిడెంట్‌ని అంటూ తెగ కంగారు పడ్డాడు. ఇక అఖిల్‌తో ఓ ఆటాడుకున్నారు సమంత.. డ్రెస్ బాగుంది.. గుజరాతీనా? అంటూ ఇరుకున పెట్టింది. ఇక అభిజిత్ అయితే తన మార్క్ స్టైల్‌లో సమంతకే బిస్కెట్లు వేసే ప్రయత్నం చేశాడు.. ప్రపంచంలో మీది బ్యూటిఫుల్ స్మైల్ అంటుంటే.. మన మాస్క్ రాజా నోయల్.. ‘మంచి ఎప్పుడూ గెలుస్తోంది’ వేదాంతం వల్లిస్తూ సమంత ముందు అడ్డంగా బుక్కయ్యాడు. సమంతతో పాటు బిగ్ బాస్ స్టేజ్‌పై సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. నాన్న ఇంటికి వచ్చి మా గురించి కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హైపర్ ఆది డిటెక్టివ్ కామెడీ.. పాయల్ రాజ్ పుత్, కార్తికేయ స్పెషల్ సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. దసరా కానుకగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటి సభ్యుల ఎమోషనల్ వీడియోలను చూపించింది సమంత. మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకులు కోరుకుంటున్న వినోదం.. హోస్ట్ నాగార్జున అందించలేకపోతున్నప్పటికీ కోడలు పిల్ల సమంత ఫుల్ ఎనర్జీతో అదరగొట్టేట్టుగా కనిపిస్తోంది.


By October 25, 2020 at 01:50PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-4-telugu-dussehra-special-episode-samantha-akkineni-replaces-nagarjuna-as-host/articleshow/78856532.cms

No comments