Breaking News

సెన్సేషనల్ డైరెక్టర్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బన్నీ


`ఈ రోజుల్లో` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు . ఆ తర్వాత వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తూనే మారుతి టాకీస్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే సాయిధరమ్‌ తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన మారుతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అత్యంత సన్నిహితుడు, స్టైలిష్ స్టార్ సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపారు. `నా చిరకాల మిత్రుల్లో ఒకడు, నా శ్రేయోభిలాషి, డైరెక్టర్ మారుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని బన్నీ గురువారం ఉదయం ట్వీట్ చేశాడు. మారుతి డైరెక్టర్‌గా మారడానికి ముందే బన్నీకి స్నేహితుడు. ఆయనకు యానిమేషన్‌లో శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.


By October 08, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-birthday-wishes-to-director-maruti/articleshow/78546377.cms

No comments