Breaking News

డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో బావిలోకి.! వరంగల్ జీపు ప్రమాదంలో షాకింగ్ నిజాలు


వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలో జీపు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బావిలో పడిన సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జీపు బావిలో పడిన వెంటనే వెనక కూర్చున్న 10 మందితో సహా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్‌ తో సహా నలుగురు జలసమాధి అయ్యారు. గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది.. రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామానికి చెందిన సతీష్‌ వరంగల్‌ నుంచి నెక్కొండకు జీపు నడుపుతుంటాడు. రోజు మాదిరిగానే వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద 15 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నెక్కొండకు బయలుదేరాడు. గవిచర్ల సమీపంలోని మోడల్‌ స్కూల్‌ దాటిన తర్వాత జీపు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి వ్యవసాయ బావిలో పడిపోయింది. డ్రైవర్‌ సతీష్‌కి ఫిట్స్ రావడం వల్లే జీపు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లిందని ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతుకుల రోడ్డులోనూ అతివేగంగా వెళ్లడంతో ఎగిరి టాప్‌కి తగిలామని.. అదే వేగంతో వెళ్తుండగా ఒక్కసారిగా డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో జీపు రోడ్డు దిగి దూసుకెళ్లింది. అమాంతం వ్యవసాయ బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. జీపు నీళ్లలో పడిన వెంటనే వెనుక కూర్చున్న ప్రయాణికులు నీటిపైకి తేలారు. బావి నిండుగా ఉండడంతో ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మలు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పదకొండు మంది ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. డ్రైవర్‌తో సహా నలుగురు జలసమాధి అయ్యారు. Also Read: జీపులో వెనుక కూర్చున్న బండి కట్టయ్య (నెక్కొండ), బానోత్‌ రామచంద్రు, ఆయన భార్య విజయ (కస్నా తండా), గుగులోతు బుజ్జి, గుగులోతు వాగ్యా, ఆయన భార్య మంజుల, భూక్యా పీతాలి (భూక్యా తండా), భూక్యా శ్రీనివాస్‌ (జుద్యా తండా), భూక్యా నవీన్‌ (రెడ్లవాడ), మాలోత్‌ సుజాత (మూడెత్తుల తండా)లతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాం సుందర్ పర్యవేక్షించారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో జీపును బయటికి తీయగలిగారు. అయితే జీపులో డ్రైవర్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. Read Also:


By October 28, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/shocking-issues-revealed-in-warangal-jeep-accident/articleshow/78905700.cms

No comments