Breaking News

కొన్ని రాష్ట్రాల్లో సామూహిక వ్యాప్తి దశలో కరోనా.. కేంద్ర ఆరోగ్య మంత్రి


దేశంలో మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో కొత్తగా 55,729 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలు దాటింది. ఇదిలా ఉండగా.. సామూహిక వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి కొనసాగుతోంది.. కానీ, దేశమంతటా ఈ పరిస్థితి లేదని అన్నారు. ‘పశ్చిమ్ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల్లో సామూహిక వ్యాప్తి దశలోకి మహమ్మారి ప్రవేశించింది.. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తీవ్రత ఉంది.. కానీ, దేశమంతటా ఇటువంటి పరిస్థితి లేదు.. కొన్ని జిల్లాల్లోనే సామూహిక వ్యాప్తి కొనసాగుతోంది’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్‌ చెందుతున్నట్టు ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన వేళ.. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విధంగా స్పందించింది. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందా? అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రిపై విధంగా సమాధానం ఇచ్చారు. కమ్యూనిటీట టాన్సిమిషన్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని ఇప్పటి వరకూ కేంద్రం చెబుతూ వస్తోంది. వైరస్ వ్యాప్తిని స్థానికంగా పరిమితం చేయడానికి కంటెయిన్‌మెంట్ వ్యూహాలను రూపొందించినట్టు తెలిపింది. ఇక, శనివారం నమోదయిన దాదాపు 62వేల కేసుల్లో 79 శాతం 10 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. మొత్తం 8 లక్షల యాక్టివ్ కేసుల్లో 50వేలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయి. కాగా, దేశంలో డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. మార్చి 2021 నాటికి మార్కెట్‌లో తగిన మోతాదులో టీకా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ పూర్తిగా అంతమవుతుందని, వైరస్ వ్యాప్తి ఇప్పటికే పీక్ దశను దాటేసిందని నిపుణుల కమిటీ పేర్కొంది. దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివరాలు చెప్పింది. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని పేర్కొంది.


By October 19, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/certain-districts-in-some-states-witnessing-community-transmission-says-union-health-minister/articleshow/78742434.cms

No comments