చైనా దుందుడుకుతనం వల్లే గాల్వన్ ఘర్షణలు.. మరోసారి అమెరికా సంచలన వ్యాఖ్యలు
జూన్ 15న తూర్పు సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు డ్రాగన్ దుందుడుకు చర్యలే కారణమని అమెరికా మరోసారి వ్యాఖ్యానించింది. టోక్యో పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకున్న వివాదాన్ని గతంలో నెలకున్న పరిస్థితులతో పోల్చిన విదేశాంగ శాఖ అధికారులు.. గతంలో పేర్కొనని లేదా అలిఖిత నిబంధనల ప్రకారం చైనా, భారత మధ్య హిమాలయాలలో విభేదాలు తలెత్తకుండా నిరోధిస్తున్నాయని అన్నారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం లడఖ్‌లో నెలకున్న సంఘర్షణకు చైనా దూకుడే కారణమని ఆరోపించారు. డ్రాగన్ వైఖరి వల్లే అకస్మాత్తుగా పరిస్థితి మలుపు తిరిగిందని ఓ అధికారి తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులతో సమావేశంలో చైనా విస్తరణవాదానికి అడ్డుకట్టవేసే ప్రణాళికపై మైక్ పాంపియో చర్చించారని మరో అధికారి వివరించారు. చైనా అధికారవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా అవగాహనకు వచ్చారని పేర్కొన్నారు. జూన్ 15న గాల్వన్ లోయలో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా పక్కా ప్రణాళికతో ఈ ఘర్షణలకు పాల్పడిందని నిరూపించే ఆధారాలు లభ్యమయ్యాయి. గాల్వన్ ఘర్షణలకు కొద్ది రోజుల ముందు భారత సరిహద్దుల్లో పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బలగాలను రంగంలోకి దింపింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్, చైనా మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
By October 08, 2020 at 07:24AM
No comments