నానమ్మను చంపేశారని కేసు పెట్టిన మనవడు.. చివరికి షాకింగ్
డెబ్భై ఏళ్ల వృద్ధురాలిని రాళ్లతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న నానమ్మను చూసిన మనవడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఎవరో నానమ్మను చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఫిర్యాదు చేసిన మనవడే నిందితుడని తేలడంతో అవాక్కయ్యారు. ఈ ఘటన జిల్లాలో జరిగింది. కంగ్టి మండలంలోని హట్యా తండాకు చెందిన పవార్ తులసీబాయి(70) గతేడాది దారుణ హత్యకు గురైంది. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి, గొంతునులిమి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై అప్పట్లో ఆమె మనవడు పవార్ కిషన్(35) ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులకి చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో తలలు పట్టుకున్నారు. తీరా ఆమె పేరుమీద నాలుగెకరాల భూమి ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. Also Read: నానమ్మను ఎవరో హత్య చేశారని ఫిర్యాదు చేసిన మనవడిపైనే పోలీసులకి అనుమానం కలిగింది. ఆస్తి కాజేసేందుకు హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజాలు కక్కేశాడు. నాలుగెకరాలు కొట్టేసేందుకు బాబయి పవార్ పుండ్లిక్, ఎల్లారం తండాకు చెందిన లచ్చీరాం సాయంతో నానమ్మను హత్య చేసినట్లు ఒప్పేసుకున్నాడు. నిందితుడు కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also:
By October 14, 2020 at 12:47PM
No comments