శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు


ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ దంపతులు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో ఉదయం తిరుమలకు చేరుకున్న దిల్ రాజు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశ్వీరచనాలు ఇచ్చారు. అనంతరం తిరిగివెళ్తున్న దిల్‌రాజును మీడియా ప్రతినిధులు పలకరించగా మాట్లాడేందుకు నిరాకరించారు. మే నెలలో తేజస్వినిని వివాహం చేసుకున్న ఆయన భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండోసారి.
By October 13, 2020 at 08:54AM
No comments