ఆ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా హీరో రామ్.. ఫన్నీగా ఉందంటూ ట్వీట్
సినీ పరిశ్రమలోకి ‘దేవదాస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు . బడా నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ తమ్ముడి కుమారుడైన రామ్.. బ్యాక్‌గ్రౌండ్‌ను నమ్ముకోకుండా తనదైన మార్క్ నటనతో హీరోగా స్థిరపడ్డాడు. మధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో అతడి కెరీర్ సంధిగ్ధంలో పడింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి అతడికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. Also Read: అసలు విషయానికొస్తే.. మన తెలుగు హీరోలు సినిమాలతో పాటు అప్పుడప్పుడు యాడ్స్‌లోనూ కనిపిస్తుంటారు. తాజాగా వారి జాబితాలో రామ్ కూడా చేరిపోయాడు. కెరీర్లో తొలిసారి కమర్షియల్ యాడ్‌లో నటించాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో కలిసి గార్నియర్ మేన్ షాంపు యాడ్‌లో నటించిన రామ్.. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో రామ్ హిందీలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. Also Read: ‘నేను నటించిన తొలి బ్రాండ్ ఎండార్స్‌మెంట్. గార్నియర్ మేన్‌తో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఈ యాడ్‌ను షూట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పడు ఫన్‌గా అనిపించింది. ఈ అసోసియేట్ మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ తాజా చిత్రం ‘రెడ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా నాయర్, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. Also Read:
By October 06, 2020 at 11:04AM
No comments