Breaking News

చేతినిండా ఆదాయమున్నా చేతివాటం.. బైకులు కొట్టేస్తున్న సివిల్ ఇంజనీర్


చక్కగా ఉద్యోగం చేసుకుని చేతినిండా సంపాదించుకునే అవకాశం ఉన్నా.. ఓ సివిల్ ఇంజనీర్ పక్కదారి పట్టాడు. జల్సాల కోసం చోరీల బాట పట్టాడు. బైకులు చేసి విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నల్లగొండ జిల్లా రామగిరికి చెందిన వెలువోలు వెంకటేష్ ప్రస్తుతం నగరంలోని రత్నగిరి నగర్‌లో నివాసముంటున్నాడు. గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో 2012లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం గుంటూరు, నల్గొండ, ఒడిశా, పూణె తదితర ప్రదేశాల్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. జల్సాలకు అటవాటుపడిన ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. గుంటూరులో పనిచేస్తున్న సమయంలో రాజీవ్ గృహకల్ప ప్లాట్ కేటాయింపుల కోసమంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి జైలు పాలయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటికొచ్చి మరో నిర్మాణ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం కూడా మానేసి ఖాళీగా ఉంటూ డబ్బుల కోసం తండ్రితో గొడవపడడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టారు. Also Read: అప్పటి నుంచి బైక్‌లు చోరీలు చేయడం మొదలుపెట్టాడు. గుంటూరులోని షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేశాడు. రెండు నెలల వ్యవధిలో 20 బైక్‌లను దొంగిలించాడు. కొట్టేసిన బైక్‌లను విక్రయించడం సమస్యగా మారడంతో నగర శివారు ప్రాంతాల్లోని ముళ్లపొదల్లో దాచేశాడు. అలా దొంగిలించిన ఓ బైక్‌ని నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసు విచారణలో 20 బైకులు దొంగిలించినట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Read Also:


By October 11, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/civil-engineer-steals-twenty-bikes-arrested-in-guntur/articleshow/78600692.cms

No comments