తిరుపతిలో పాస్టర్ అకృత్యం.. యువతిని కొట్టి, బెదిరించి అత్యాచారం
తిరుపతిలో దారుణ ఘటన వెలుగుచూసింది. చర్చి పాస్టర్ యువతిని, కొట్టి, గాయపరిచి అత్యాచారం చేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన ఓ చర్చి పాస్టర్ దేవసహాయం రెయిన్‌బో కెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీలో పట్టణంలోని చింతలచేను ప్రాంతానికి చెందిన యువతి(20) గత నెలలో పనిలో చేరింది. ఆమెపై కన్నేసిన పాస్టర్ దేవసహాయం తరచూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. కోరిక తీర్చమంటూ ఒత్తిడి చేసేవాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రి రేణిగుంట మండలం గాజులమాండ్యం గ్రామంలో కంపెనీ ఉత్పత్తులు డెలివరీ ఇవ్వాల్సి ఉందంటూ యువతిని వ్యానులో ఎక్కించుకుని వెళ్లాడు. రేణిగుంట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టి, గాయపరిచి అమానుషంగా చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. బాధితురాల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గాజులమాండ్యం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె 12వ తేదీన స్పందనలో ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏఎస్పీ ఆదేశించడంతో గాజులమాండ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తిరుపతి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Also Read: అయితే బాధిత యువతి తల్లి ఆస్పత్రి వద్ద పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తే అంత పెద్దవారితో గొడవొద్దు.. సిమ్ మార్చేసి వేరే పనిచేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపేశారని ఆరోపించారు. అందుకే సోమవారం స్పందనలో ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ స్థానిక నాయకులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. నిందితుడు దేవసహాయం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also:
By October 15, 2020 at 09:19AM
No comments