Breaking News

మద్యం ప్రియులకు షాక్.. ఇకపై ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం బ్యాన్!


ఆర్మీ క్యాంటీన్‌లలో విదేశీ వస్తువులు, విదేశీ మద్యం ఇకపై దొరకడం కష్టమే. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 విదేశీ వస్తువులను కొనుగోలు చేయరాదని కేంద్రం ఆదేశించినట్టు రాయిటర్స్ పేర్కొంది. ఇది డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి విదేశీ మద్యం సంస్థలకు ఓ విధంగా చేదువార్తే. ఆర్మీ క్యాంటీన్‌లలో మద్యం, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను సైనికులు, మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాలకు రాయితీపై అమ్ముతారు. ఏడాదికి 2 బిలియన్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దేశంలో అతిపెద్ద రిటెయిల్ మార్కెట్ ఇదే. అక్టోబరు 19న రక్షణ శాఖ అంతర్గత ఆదేశాల ప్రకారం.. ‘ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యమానికి మద్దతుభవిష్యత్తులో ప్రత్యక్షంగా దిగుమతి చేసుకునే వస్తువుల అమ్మకం నిషేధం. దీనిపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో మే, జులై నెలలో చర్చించాం’ అని పేర్కొంది. అయితే, దీనిపై స్పందించడానికి రక్షణ శాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. అంతేకాదు, ఏ ఉత్పత్తులు అనేది ఉత్తర్వుల్లో స్పష్టం చేయలేదు, కానీ దిగుమతి చేసుకున్న మద్యం కూడా ఈ జాబితాలో ఉండవచ్చని తాము విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆర్మీ క్యాంటీన్‌లలోని మొత్తం అమ్మకాల్లో 6 నుంచి 7 శాతం విదేశీ వస్తువులు ఉన్నట్టు ఆగస్టు నాటి డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నివేదిక తెలిపింది. డైపర్స్, వాక్యూమ్ క్లీనర్లు, హ్యాండ్‌బ్యాగ్స్, ల్యాప్‌టాప్‌లు వంటి చైనా ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి విదేశీ మద్యం సంస్థలకు జూన్ నుంచే ఆర్డర్లు నిలిపివేసినట్టు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే, డియోజియా మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. పెర్నోడ్ దీనిని ఖండించింది. ఆర్మీ క్యాంటీన్‌లలో ఏడాది 17 మిలియన్ల విలువైన విదేశీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.. ఈ ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందని ఓ సంస్థ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ‘విదేశీ మద్యం అమ్మకాలు స్వల్పంగా జరుగుతాయి.. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం దీన్ని ఎందుకు చేస్తుంది? ఇది గందరగోళం, విరుద్ధమైన సంకేతం’ అని ఆ ఎగ్జిక్యూటివ్ అన్నారు.


By October 24, 2020 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-bans-imported-goods-at-army-canteens-list-may-include-liquor-says-report/articleshow/78839292.cms

No comments