కలిసి బతకనివ్వని పెద్దలు.. విడిచి ఉండలేని ప్రేమికులు.. కడపలో విషాదం
జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. పేమికుల జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని రాపూర్ చిట్వేల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెనగలూరు మండలం నారాయణ నెల్లూరికి చెందిన బాలబాబు, అంజలి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రియుడు బాలబాబుకి మరొక అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కలిసి బతకలేక.. విడిచి ఉండలేక ప్రేమికులు అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఐదు రోజుల క్రితం యువతీయువకుడు కనిపించకుండా పోవడంతో పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. Also Read: అటవీ ప్రాంతంలో ప్రేమజంట మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. Read Also:
By October 16, 2020 at 12:41PM
No comments