పాన్ ఇండియా మూవీగా ‘సైనైడ్’ ... కీలక పాత్రలో ప్రియమణి
మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను నమ్మించి సైనైడ్ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 - 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ ‘సైనైడ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్ ఇండియా మూవీగా ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్ నారాయణన్ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్, రోహిణి, చిత్రంజన్ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్ జోసెఫ్ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంచలనాత్మక కేసు ప్రేరణతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియమణి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు’ అని తెలిపారు. ‘‘20 మంది మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని ఆ తర్వాత హత్యలకి పాల్పడిన మోహన్ కథే ఈ సినిమా. జనవరి నుంచి షూటింగ్ స్టార్ అవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. By October 01, 2020 at 09:13AM
No comments