Anushka: పెళ్లి పీటలపై ప్రభాస్- అనుష్క! ఆనాడే జరిగిపోయింది.. సింగిల్ లైన్లో మ్యాటర్ చెప్పేసిన స్వీటీ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో మొదటి వరుసలో ఉన్న పేర్లు , అనుష్క. వెండితెరపై ఈ జోడీకి ఉన్న క్రేజ్ మరే జోడీకి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిల్లా, మిర్చి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిలో పడి ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ జంట. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్ళ కెమిస్ట్రీ చూశాక వీరిద్దరి రిలేషన్, పెళ్లిపై చాలా రూమర్స్ బయటకొచ్చాయి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, పెళ్లికి రెడీ అయ్యారని చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో పెళ్లి పీటలపై కూర్చొని చూడచక్కగా కనిపిస్తున్న ప్రభాస్- ఫోటో ఒకటి వైరల్ కావడం, దానిపై అనుష్క రియాక్ట్ కావడం జరిగాయి. ఈ ఫొటోలో పెళ్లిపీటలపై కూర్చొని ఎంతో సంతోషంగా అనుష్కతో ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు ప్రభాస్. ఇద్దరి ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. పీటలెప్పుడు ఎక్కారు? సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా ఏంటి? అనేగా మీ సందేహం. చూడడానికి అలాగే ఉన్నా ఇది రియల్ మ్యారేజ్ కాదు.. రీల్ మ్యారేజ్. ఈ సీన్ 'మిర్చి' చిత్రం లోనిది. నిజం కాకపోయినా.. నిజం అయితే బాగుండు అనే ఆశతో ఈ ఫోటోను భద్రంగా దాచుకున్నారు ప్రేక్షకులు. Also Read: అయితే ఇటీవలే ట్విట్టర్లోకి అధికారికంగా అడుగుపెట్టిన అనుష్క.. నిన్న(ఆదివారం) మొదటిసారి అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించింది. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. ఈ పిక్ షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన స్వీటీ..''మిర్చి చిత్ర షూటింగ్లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు'' అని తెలిపింది. ఇకపోతే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఈ వారమే 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
By October 05, 2020 at 08:49AM
No comments