Breaking News

అభం శుభం తెలియని చిన్నారులపై ఆకృత్యాలు.. కామాంధుడికి 600 ఏళ్ల జైలు శిక్ష


ముక్కుపచ్చలారని చిన్నారులపై లైంగిక చర్యలకు పాల్పడి, వాటిని వీడియో తీసిన కామాంధుడికి న్యాయస్థానం 600 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక చర్యలకు ప్రోత్సహించి, వాటిని చిత్రీకరించిన కేసులో అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. కాటన్‌డేల్‌కు చెందిన నిందితుడు మ్యాథ్యూ టైలర్‌ మిల్లర్‌ (32)పై పలు లైంగిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్‌ జూనియర్‌ మాట్లాడుతూ.. నిందితుడి వికృత చర్యల వల్ల ఆ చిన్నారుల బాల్యం దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-2019 మధ్యకాలంలో మిల్లర్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. బాధిత చిన్నారుల్లో ఇద్దరు మరీ నాలుగేళ్ల వయసువారని (నేరం జరిగినపుడు) ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. నిందితుడి గదిని ఎఫ్‌బీఐ అధికారులు శోధించిన సమయంలో చిన్నపిల్లలకు చెందిన 102 అశ్లీల చిత్రాలు లభ్యమయ్యాయన్నారు. ఇక, 2019 అక్టోబరులో మిల్లర్‌ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పన్నెండేళ్లలోపు వయసున్న చిన్నారితో స్వయంగా లైంగికచర్యలో పాల్గొన్న అభియోగం కూడా నిందితునిపై ఉంది. ఈ రోజున చిన్నారులపై లైంగిక దోపిడీ కేసులో విధించిన శిక్షలు చట్టం అమలు నిబద్ధతను ప్రతిబింబిస్తాయని అధికారులు వ్యాఖ్యానించారు. మిల్లర్ అంగీకరించిన నేరాలు కలవరానికి గురిచేసేవి మాత్రమే కావు సమాజానికి అనారోగ్యకరమని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌బీఐ చేసిన కృషికి నేను గర్వపడుతున్నా.. ఈ రోజు విధించిన శిక్షను అభినందిస్తున్నాను, ఎందుకంటే మిల్లర్ తన జీవితమంతా జైలు గోడల మధ్యే గడుపుతాడని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ బాలల దోపిడీ, హ్యూమన్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ విభాగం ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది.


By October 03, 2020 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-man-matthew-sentenced-to-600-years-in-prison-in-child-abusing-case/articleshow/78457013.cms

No comments