Breaking News

బట్టలషాపు ఓనర్ కిడ్నాప్.. సర్వం దోచేసి చార్జీలకు రూ.500.. పశ్చిమ గోదావరిలో దారుణం


బట్టల షాపు ఓనర్‌‌ని చేసి కారులో కొట్టుకుంటూ తీసుకెళ్లి నగలు, నగదు అపహరించిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం దూబచర్లకి చెందిన కె.రామకృష్ణ నల్లజర్లలో రెడీమేడ్ బట్టల షాపు నిర్వహిస్తున్నాడు. రాత్రి దుకాణం మూసివేసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా పుల్లలపాడు వీరమ్మ చెరువు సమీపంలో కారులో వచ్చిన దుండగులు రామకృష్ణని కిడ్నాప్ చేశారు. అడ్రస్ అడుగుతున్నట్టుగా నటించిన నలుగురు దుండగులు రామకృష్ణని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఒకరు తన స్కూటీని తీసుకోగా.. మరో ముగ్గురు నోరుమూసి కారులో పడేశారు. అనంతరం అక్కడి నుంచి అతన్ని కారులోనే కొట్టుకుంటూ చక్కర్లు కొట్టారు. తన బ్యాగులో ఉన్న సుమారు లక్షన్నర నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అతని సెల్‌ఫోన్ ఏటీఎం కార్డులను లాక్కుని పిన్ నంబర్లు అడిగి తెలుసుకున్నారు. కారులోనే రామకృష్ణపై రాడ్డుతో దాడి చేసి గాయపరిచారు. కేకలు వేస్తే చంపేస్తామంటూ బెదిరించడంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. అనంతరం గుండుగొలను జంక్షన్ వద్ద మరో ఇద్దరు దుండగులు కారెక్కారు. అక్కడి నుంచి గుంటూరు వైపు కారులో తీసుకెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వద్ద వదిలేసి పారిపోయారు. చార్జీల కోసం రూ.500 ఇచ్చి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పి పరారైనట్టు బాధితుడు రామకృష్ణ తెలిపాడు. Also Read: టోల్‌గేట్ వద్ద నుంచి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మంగళగిరి వచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మరుసటి రోజు రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు రామకృష్ణ ఏటీఎం కార్డుతో ఓ చోట షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. Read Also:


By October 02, 2020 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/businessman-kidnapped-in-west-godavaris-nallajerla/articleshow/78441129.cms

No comments