Breaking News

ఖుష్బూపై 30 పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు... క్షమించాలంటూ నటి వేడుకోలు


దివ్యాంగులను అవమానించారన్న ఆరోపణలపై సీనియర్ నటి, భాజపా నాయకురాలు ఖుష్బూ క్షమాపణ కోరారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె సోమవారం ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత లేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేకే వైదొలిగినట్లు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ‘మానసిక పరిపక్వత లేని’ అని ఆమె వాడిన పదం వివాదంలో చిక్కుకుంది. కుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా ఉన్నాయంటూ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక పేర్కొంది. దీంతో చెన్నై, కాంచీపురం, కోయంబత్తూర్‌, చెంగల్‌పట్టు, మదురై, తిరుప్పూర్‌ తదితర జిల్లాల్లో సుమారు 30 పోలీస్‌స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెన్నై కమిషనరేట్‌లో కూడా ఆమెపై పలువురు కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖుష్బూ దివ్యాంగులకు క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినో అవమానించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, తీవ్రమైన వేదనతో ఆ క్షణంలో అనుకోకుండా కొన్ని పదాలను తప్పుగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దివ్యాంగులను కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. Also Read:


By October 16, 2020 at 07:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-bjp-leader-khushboo-says-apology-to-mentally-challenged-people/articleshow/78692077.cms

No comments