Ram Gopal Varma: దిశ ట్రైలర్.. గ్యాంగ్ రేప్, మర్డర్ అచ్చుగుద్దినట్లు దింపిన రామ్ గోపాల్ వర్మ
దేశవిదేశాలను వణికించిన దిశ ఘటన ఆధారంగా 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన దుర్ఘటన, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు వర్మ. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించిన వర్మ.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. వర్మ విడుదల చేసిన ఈ దిశ ట్రైలర్‌లో.. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆ తర్వాత లారీలో తీసుకెళ్లి తగులబెట్టిన ఘటనలకు అచ్చుగుద్దినట్లు చూపించి సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు. దీంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దిశగా నటించిందని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. Also Read: ''నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారతదేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత ప్రభుత్వం అత్యాచార చట్టాలను మార్చడమే కాక ప్రపంచంలో మొట్టమొదటిసారి బాధితుడి పేరు మీద దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సరిగ్గా ఏడాదికి అనగా అదే నవంబర్ 26వ తేదీ 2020న 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ రిలీజ్ కానుంది'' అని పేర్కొన్నారు వర్మ. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ దిశ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
By September 26, 2020 at 11:58AM
No comments