Ongole: కరెంట్ బిల్లు కట్టావా అంటూ ఇంట్లో దూరిన లైన్‌మెన్.. ఆమె చేయిపట్టుకుని..
కరెంట్ బిల్లు పేరుతో ఇంట్లోకి చొరబడిన లైన్‌మన్ వివాహితపై అత్యాచార యత్నం చేసిన అమానుష ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం గుంటుపల్లి సచివాలయంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న యువకుడు తలుపుల మల్లికార్జున సమీపంలోని తురకపల్లికి వెళ్లాడు. ఇంటి కరెంట్ బిల్లు కట్టావా అంటూ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న వివాహిత బిల్లు చెల్లించామని చెబుతుండగా నీచంగా ప్రవర్తించాడు. ఆమె చేయిపట్టుకుని దగ్గరికి లాగాడు. ఊహించని పరిణామంతో షాక్‌కి గురైన వివాహిత ఒక్కసారిగా పెద్దగా కేకలు వేసింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు రావడంతో మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి భర్తతో లైన్‌మెన్ స్నేహంగా ఉంటూ ఆ చనువుతో ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా ఆమె అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 26, 2020 at 11:26AM
No comments