Navdeep: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం.. రకుల్ పేరు బయటకు రావడంతో నవదీప్‌పై కన్ను!! ఇదీ హీరో రియాక్షన్

బాబోయ్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న డ్రగ్స్ కోణాలు మరోసారి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు కాస్త వైపు టర్న్ తీసుకొని పలువురు సినీ నటుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఎన్సీబీ అధికారులకు దొరుకుతున్న సమాచారం సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. రీసెంట్గా ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రకుల్ పేరు బయటకు రావడం టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ పుట్టించింది. ఈ క్రమంలోనే హీరో నవదీప్‌ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు షికారు చేస్తుండటం జనాల్లో హాట్ ఇష్యూ అయింది. గతంలో 2017 సంవత్సరంలో డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీని వణికించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు యంగ్ హీరో నవదీప్ పైన కూడా ఆరోపణలు రావడంతో విచారణ జరిపారు. ఆ తర్వాత ఆ కేసు విషయమై ఎలాంటి అఫీషియల్ సమాచారం రాకుండానే సమసిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ ఇష్యూ తెరపైకి రావడం, పైగా డ్రగ్ సరఫరా దారులకు టాలీవుడ్‌తో లింక్ ఉందని తెలుస్తుండటంతో జాగ్రత్త అంటూ హీరో నవదీప్‌కి నెటిజన్స్ మెసేజీలు పోస్ట్ చేస్తున్నారు. Also Read: దీంతో ఈ విషయమై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై వెంటనే రియాక్ట్ అయిన నవదీప్ అతనికి రిటర్న్ కౌంటర్ వేశాడు. ''నాకు ఏం బాధ లేదు బ్రదర్.. నువ్వు కూడా ఏ బాధ పడకు. పద పనికొచ్చే పనులు చేసుకుందాం'' అంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చాడు. మరోవైపు రకుల్ ఇంటికి కొందరు టాలీవుడ్ ప్రముఖులు రెగ్యులర్‌గా వచ్చిపోతుంటారనే విషయాన్ని ఆమె నైబర్ నళిని వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందనేది.
By September 13, 2020 at 10:07AM
No comments