Nagarjuna: గంగవ్వ విషయంలో మాటమార్చిన నాగార్జున.. ప్రేక్షకులు షాక్.. ఆ పిలుపుకు కారణమిదేనా?
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ లుక్ పరంగా ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. 60 ఏళ్లు పైబడినా ఆయన మాత్రం టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నారు. లుక్ పరంగా, యాక్టివ్‌నెస్ పరంగా యమ అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఇదే విషయమై నెటిజన్లకు ఆయన టార్గెట్ కావడం, ఆ తర్వాత నాగార్జున లైన్ లోకి వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ ఆసక్తికర పరిణామాలు తాజాగా ప్రసారమవుతున్న బిగ్‌బాస్-4 లో చోటుచేసుకోవడం విశేషం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవలే ప్రారంభమైన బిగ్‌బాస్ -4లో ఓ వైపు హోస్ట్ నాగార్జున, మరోవైపు కంటిస్టెంట్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే గతవారం గంగవ్వను హోస్ట్ నాగార్జున.. అవ్వా అని పిలవడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. 61 ఏళ్ల వయసున్న నాగార్జున ఆమెను అవ్వా అనడం చూసి షాక్ అయిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో నాగార్జునను తెగ ట్రోల్ చేశారు. నాగార్జున, గంగవ్వ వయసులో ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ కింగ్ పిలుపును తప్పుబట్టారు. దీంతో ఈ ఇష్యూ నెట్టింట సెన్సేషన్ అయింది. Also Read: గంగవ్వ 1959 జూలై 25న జన్మించగా.. నాగార్జున 1959 ఆగష్టు 29న జన్మించారు. అంటే గంగవ్వ నాగార్జున కంటే ఓ నెలరోజులు మాత్రమే పెద్ద. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గంగవ్వను నాగార్జున అవ్వా అని పిలవడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చిందో లేదో తెలియదు గానీ.. ఈ వారం ఎపిసోడ్‌లో మాట మార్చేశాడు బిగ్‌బాస్. గంగమ్మ మీ ఆరోగ్యం ఎలాగుంది, ఎప్పటికీ మీరు బాగుండాలి గంగమ్మ అని నాగార్జున అనడంతో అంతా మరోసారి షాకయ్యారు. ఇకపోతే నాగార్జునను అన్నా అని గంగవ్వ పిలుస్తున్న పిలుపును యాక్సెప్ట్ చేసి.. "నన్ను అన్న అని పిలిచావు కదా.. నువ్వు నా చెల్లెలివి" అని అన్నాడు కింగ్. అయితే దీనంతటికీ కారణం నెటిజన్ల ట్రోలింగే అని తెలుస్తోంది. అంతా గంగవ్వ అంటున్నారు కాబట్టే అదే యాసలో నాగార్జున అన్నాడు తప్ప.. తన వయసు తెలియక కాదు అని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఏదిఏమైనా బిగ్‌బాస్‌లో నాగార్జున- గంగవ్వ ఇష్యూ మాత్రం జనాన్ని బాగా ఆకర్షిస్తోంది.
By September 20, 2020 at 11:47AM
No comments