Breaking News

Hyd: పెళ్లికి టైం కావాలన్న ప్రియుడు.. కళ్లముందే పరుగెత్తుకెళ్లిన ప్రియురాలు.. షాకింగ్!


పెళ్లి చేసుకునేందుకు కొంతసమయం కావాలని ప్రియుడు చెప్పడంతో ఆవేశానికి లోనైన ప్రియురాలు ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రాత్రి వేళ ఫ్లై ఓవర్ వద్ద పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు షాక్‌కి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ప్రాంతానికి చెందిన పూజిత(19) ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే యువకుడిని ప్రేమించింది. మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ కొద్దికాలంగా పూజిత ప్రియుడిపై ఒత్తిడి తెస్తోంది. అదే విషయం మాట్లాడేందుకు సీతాఫల్‌మండి ఫ్లై ఓవర్ వద్దకు రావాలని పిలిచింది. మరో స్నేహితుడితో కలసి ప్రదీప్ అక్కడికి వచ్చాడు. మరోమారు వివాహం విషయమై ఇద్దరి మధ్య చర్చకు రావడంతో కొద్దికాలం ఆగాలని ప్రియుడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన పూజిత పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్లై ఓవర్ పై నుంచి దూకేసింది. Also Read: రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజిత ప్రాణాలు విడిచింది. ఊహించని ఘటనతో భయపడిపోయిన ప్రియుడు ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. మృతురాలి తండ్రి పాండు ఫిర్యాదు మేరకు పూజిత ఆత్మహత్యకు కారణమైన ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:


By September 25, 2020 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-year-old-girl-jumps-off-from-flyover-in-hyderabad-dies/articleshow/78309111.cms

No comments