Breaking News

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. కానీ మూణ్నెల్లకే..


పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం పెట్టిన మూణ్నెల్లకే జంట బలవన్మరణానికి పాల్పడింది. కన్నవాళ్లను కాదనుకుని వచ్చిన యువతిని భర్త ఆవేశంలో దుర్భాషలాడడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణంతో భయపడిపోయిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అత్యంత విషాద ఘటన తమిళనాడులో జరిగింది. ఈరోడ్ జిల్లా అందియూర్ తాలూకా ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్(23), అదే ప్రాంతానికి చెందిన రమ్య(23) ప్రేమించుకున్నారు. ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పినా ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం అందియూర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తగా కాపురం పెట్టారు. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో భర్త నోరుజారాడు. రమ్యని తిట్టడంతో ఆమె తీవ్ర మనస్ధాపానికి గురైంది. క్షణికావేశంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. Also Read: పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఇలంగోవన్ ఉరికి వేలాడుతున్న భార్యని చూసి షాక్‌కి గురయ్యాడు. భార్య బలవన్మరణంతో భయాందోళనకు గురైన భర్త కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు కూడా ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వెళ్లి చూడడంతో దారుణం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. Read Also:


By September 30, 2020 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-couple-commits-suicide-in-tamil-nadus-erode/articleshow/78398826.cms

No comments