లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో విషాదం


లోక్‌సభ స్పీకర్ విషాదం. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఓం బిర్లా, ఆయన కుటుంబానికి సహచర ఎంపీలు, బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీకృష్ణ బిర్లా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఎంపీ సుప్రియా సూలే తదితరులు శ్రీకృష్ణ బిర్లా ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కోవిడ్ నిబంధనల నడుమ కిషోరాపూర్ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
By September 30, 2020 at 09:32AM
No comments