Breaking News

నాలుగేళ్ల చిన్నారికి శానిటైజర్ తాగించి అత్యాచారం.. గుంటూరులో అమానుషం


జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. సోదరుడితో సెంటర్‌కి వచ్చిన నాలుగేళ్ల బాలిక తప్పిపోయి కామాంధుడి కంటపడింది. మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన దుర్మార్గుడు ఆమెకు శానిటైజర్ తాగించి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక మిస్సింగ్ సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కీచకుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ ఘటన మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పేరేచర్లకి చెందిన నాలుగేళ్ల బాలిక తన సోదరుడితో కలసి సెంటర్‌కి వచ్చి తప్పిపోయింది. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకి అర్ధరాత్రి వేళ రైల్వే స్టేషన్‌లో తీవ్రరక్తస్రావంతో బాలిక కనిపించింది. ఆమెను వెంటనే వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: బాలికను తీసుకెళ్లిన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. నిందితుడు నల్లపాడుకి చెందిన స్వామి(50)ని అదుపులోకి తీసుకుని విచారించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. సెంటర్‌లో ఒంటరిగా కనిపించిన బాలికని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి శానిటైజర్ తాగించాడు. అనంతరం చిన్నారిపై అమానుషానికి తెగబడ్డాడు. మనవరాలి వయసున్న చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేశాడు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి పరారయ్యాడు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also Read:


By September 24, 2020 at 09:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-year-old-girl-raped-in-guntur-one-held/articleshow/78288662.cms

No comments