తిరుపతి గ్యాంగ్ వార్.. ఒకరినొకరు చంపుకుంటూ చెలరేగుతున్న రౌడీమూకలు
గ్యాంగ్ వార్ ఘటన ఆధ్యాత్మిక క్షేత్రంలో అలజడి రేపుతోంది. నడిరోడ్డుపై రౌడీషీటర్ దినేష్(35) హత్యతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న దినేష్ గతంలో జరిగిన బెల్టు మురళి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రత్యర్థి వర్గీయులే దినేష్‌ని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ ఎదుట కాపుకాసిన దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి అంతమొందించారు. ఈ కేసుకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. రెండేళ్ల కిందట నగరానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని చెప్పారు. అతని హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అతని అనుచరులు బెల్టు రమణని చంపేశారు. ఆ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. రమణ హత్యకి ప్రతీకారంగానే తాజాగా దినేష్ జరిగిందని ఆయన చెప్పారు. పాతకక్షల నేపథ్యంలోనే వరుస హత్యలు జరిగాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు.. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతి నెహ్రూనగర్‌కు చెందిన బెల్ట్ మురళి రౌడీయిజం చేస్తూ ఉండేవాడు. అతనితో నెహ్రూనగర్‌కు చెందిన భార్గవ్‌తో పాటు మరికొందరు సన్నిహితంగా ఉంటూ దందాలు సాగించేవారు. భార్గవ్‌కి దాసరి మఠానికి చెందిన మరొకరితో ఆధిపత్య పోరు నడిచింది. తనతో సన్నిహితంగా ఉండే బెల్ట్ మురళి తన ప్రత్యర్థితో కూర్చుని మద్యం తాగుతున్న ఫొటోలు చూసి భార్గవ్ ఆగ్రహం చెందాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలైనట్లు తెలుస్తోంది. Also Read: భార్గవ్ అనుచరులు మురళిపై దాడి చేసి గాయపరచడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. తనపై హత్యాయత్నం చేయడంతో పగతో రగిలిపోయిన మురళి.. ప్రత్యర్థితో చేతులు కలిపి రెండేళ్ల కిందట భార్గవ్‌ని చంపేశాడు. అప్పటి నుంచి భార్గవ్ అనుచరులకు మురళి టార్గెట్‌గా మారాడు. గతేడాది భార్గవ్ అనుచరులు బెల్ట్ మురళిని దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్‌ని ఇప్పుడు మురళీ వర్గీయులు చంపేశారు. ఇలా రౌడీమూకలు ఒకరినొకరు చంపుకుంటూ పోవడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో వరుస హత్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. Read Also:
By September 22, 2020 at 03:26PM
No comments