Breaking News

నెల రోజుల తర్వాత భారీగా కొత్త కేసులు.. ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం!


కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానాలను తమ దేశంలోకి అనుమతించోమని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో భారత్ నుంచి రాకపోకలు సాగిస్తోన్న ప్రయాణికుల వల్లే తమ దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయని హాంకాంగ్ పేర్కొంది. ఈ కారణంతోనే ఎయిరిండియా విమానాలను రాకపోకలపై నిషేధిం విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అక్టోబర్ 3వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని, ఎయిర్ ఇండియాతోపాటు క్యాథే డ్రాగన్ విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని హాంకాంగ్ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 18న క్యాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ అంశాన్ని హాంకాంగ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తమ ప్రయాణానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పించిన వీరికి, అక్కడకు చేరిన పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో హాంకాంగ్‌లో నెల రోజుల తర్వాత ఒక్క రోజులో అత్యధికంగా 23 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మూడో వంతు మంది భారత్ నుంచి వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా విమానాలను నిషేధిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు నుంచి ఎయిరిండియా విమానా సర్వీసులను హాంకాంగ్‌కు నడుపుతున్నారు. భారత్ నుంచి వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని జులైలో హాంకాంగ్ ప్రభుత్వం నిబంధనలు జారీచేసింది. ఆగస్టు 29, సెప్టెంబరు 4న దుబాయ్ వెళ్లిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎయిరిండియా విమానాలపై దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.


By September 21, 2020 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/hong-kong-govt-bans-air-india-flights-says-one-third-of-new-cases-recently-travelled-from-india/articleshow/78230240.cms

No comments