Breaking News

సెక్స్‌కి సహకరించడం లేదని భార్య హత్య.. పెళ్లైన కొద్దిరోజులకే ఘాతుకం


తమిళనాడులోని జిల్లాలో నవవధువు మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమెను భర్తే చంపేసి దుండగులు హత్యాచారం చేసినట్లు నమ్మించినట్లు తేల్చారు. తిరుచ్చి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి(26)కి కొద్దిరోజుల క్రితమే వివాహమైంది. శనివారం అర్ధరాత్రి బహిర్భూమి కోసం ఆమె ఇంటికి సమీపంలోని నదీ తీరానికి వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. Also Read: ఓ చోట నగ్నంగా అపస్మారక స్థితిలో పడివున్న ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా కనిపించలేదు. దీంతో దుండగులు ఎవరైనా ఆమెపై అత్యాచారం చేసి నగలు దొంగిలించినట్లు భావించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో భర్తను ప్రశ్నించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లయినప్పటి నుంచి ఆమె సెక్స్‌కు ఒప్పుకోవడం లేదని, ఎంత బ్రతిమాలినా తన మాట వినకపోవడంతో శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. Also Read: ఆ రోజు రాత్రి ఆమెను బలవంతంగా చేసి లైంగిక దాడికి పాల్పడ్డానని, మరోసారి కోరిక తీర్చాలని కోరగా భార్య గొడవ పడిందని చెప్పాడు. ఆ కక్షతోనే అర్ధరాత్రి వేళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెను చంపేసి దుండగుల పనిగా చిత్రీకరించినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:


By September 01, 2020 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-in-tamil-nadu-over-she-refuses-sex-with-him/articleshow/77864525.cms

No comments